Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతేడాది 'రన్నింగ్ షాది. కామ్', 'నామ్ షబానా', 'జుడ్వా 2' చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన తాప్సీ ఇప్పటికే రెండు బాలీవుడ్లో సినిమాల్లో నటిస్తోంది. తాజాగా 'దిల్ జంగ్లీ' పేరుతో రూపొందుతున్న కామెడీ చిత్రంలో కథానాయికగా నటించేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది.
దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను తాప్సీ గురువారం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. నటుడు, నిర్మాత జాక్కీ భగ్నాని సైతం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సాఖిబ్ సలీమ్‌కి జోడీగా తాప్సీ నటించనుంది. అలెయా సెన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీప్షికా దేశ్‌ముఖ్, భగ్నాని జైన్, మయాంక్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి తాప్సీ చెబుతూ, 'ఈ సినిమాతో నేను మళ్లీ శక్తివంతమైన నటనకు స్కోప్ ఉన్న జోన్లోకి వెళ్లిపోతాను. 'పింక్' తర్వాత ఏదైన భిన్నంగా చేయాలనుకున్నాను. ఇది కామెడీ చిత్రమే అయినప్పటికీ నా పాత్ర, సినిమా కథ, ప్రతిదీ భిన్నంగా ఉంటుంది' అని తెలిపింది. తెలుగులో ఓ చిత్రంతోపాటు హిందీలో 'ముల్క్', 'మన్మర్జియన్' చిత్రాల్లో తాప్సీ నటిస్తోంది.