Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కత్రినా కైఫ్ ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో కలిసి 'జీరో' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఆనంద్. ఎల్. రారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పాట చిత్రీకరణలో ఉంది. ఇందులో భాగంగా కత్రినాపై ఓ ప్రతిష్టాత్మక పాటను షూట్ చేస్తున్నారు. షూటింగ్ స్పాట్‌లోని కత్రినా ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గోల్డ్ కలర్ కాస్ట్యూమ్స్‌తో పాటకు స్టెప్పులేయడానికి రెడీగా ఉన్న గెటప్‌లో కత్రినా మెరిసిపోతోంది.
షారూఖ్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కత్రినాతోపాటు అనుష్క శర్మ మరో కథానాయికగా నటిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు. కత్రినా దీంతోపాటు 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రంలో అమీర్‌ఖాన్‌కి జోడీగా నటిస్తోంది.