Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన కథలతో భిన్నమైన సినిమాలను రూపొందిస్తూ దర్శకుడిగా అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వి.ఐ.ఆనంద్. కొత్త కథలతో ప్రయోగాలు చేస్తూ విజయాలను సొంతం చేసుకుంటూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా పరిశ్రమ మెచ్చేంత గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ మంగళవారం తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ప్రస్తుతం ఓ అగ్రహీరోతో చేయబోయే ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో ఆనంద్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి సన్నిహితులు చెబుతూ, ''టైగర్' చిత్రంలో కాశీ పరువు హత్యలు లాంటి సంచలన విషయాన్ని చూపిస్తే, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'లో ఆత్మలతో మనుషుల ప్రేమను హైలైట్ చేశాడు. 'ఒక్కక్షణం'లో ప్యారలల్ లైఫ్ అంటూ మనకు తెలియని ఓ కొత్త ప్రపంచాన్ని చూపించాడు. ఇప్పుడు ఓ అగ్ర నిర్మాణ సంస్థలో అగ్ర హీరోతో త్వరలోనే సినిమా చేయబోతున్నాడు. కొత్తదనానికి పెద్దపీఠ వేసిన వినూత్న దర్శకుడు
వి.ఐ.ఆనంద్' అని తెలిపారు.