Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో భిన్న పాత్రలు పోషించే కథానాయికల్లో అలియా భట్ ఒకరు. గ్లామర్ పాత్రలే కాదు, డీగ్లామర్ పాత్రలు సైతం చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. తాజాగా నటిస్తున్న 'రాజీ' చిత్రంలో మరోసారి మరోసారి డీగ్లామర్‌గా కనిపించనుంది. మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 1971యుద్ధం ప్రధానంగా ఇండియా-పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న సంఘటనల ఇతివృత్తంగా రూపొందుతున్న ఈ చిత్రం ఒక అద్భుతమైన భారతీయ యువతి కథను తెలియజేస్తుంది.
ఈ యుద్ధ సమయంలో కాశ్మీర్‌కు చెందిన గూఢచారి అమ్మాయి, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది. సాధారణ అమ్మాయిగా బార్డర్లో తిరుగుతూ అక్కడి సమాచారాన్ని అందిస్తూ, అసాధారణ పరిస్థితుల్లో తనని తాను తెలుసుకునేందుకు ఓ అమ్మాయి పడిన సంఘర్షణ ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోంది. బార్డర్లో తిరిగే క్రమంలో అలియా డీ గ్లామర్‌గా కనిపించనుందట. గురువారం అలియా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రంలోని తన పాత్ర లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బుర్కా ధరించి సాధారణ మహిళగా అలియా డీ గ్లామర్‌గా కనిపిస్తోంది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 11న విడుదల చేయనున్నారు. 'నటీనటులకు కొన్ని పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన పాత్ర నాకు 'రాజీ' చిత్రం నుంచి లభించింది. ఇటువంటి పాత్రను గతంలో ఎన్నడూ పోషించలేదు. నా నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే పాత్ర ఇది' అని అలియా తెలిపింది.