Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్, కమల్ హాసన్ అగ్ర నటులు మాత్రమే కాదు అంతకు మించి ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇటీవల ఇద్దరూ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. కమల్ హాసన్ 'మక్కల్ నీది మయ్యమ్' పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో ఉన్న అనుబంధాన్ని, రాజకీయ భవిష్యత్ గురించి తాజాగా కమల్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, 'సినిమా రంగంలో రజనీకాంత్‌కు, నాకున్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేశాం. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాం. అయినప్పటికీ మా ఇద్దరి వ్యూహాలు, అభిరుచులు వేరు. సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు నేను చేయలేదు. ఆయన కూడా నాలాంటి పాత్రలు చేయలేదు. ఏదేమైనా సినిమాలో మా ఉద్దేశం ఒక్కటే.. ప్రేక్షకులను అలరించడం. ఇప్పుడు ఇద్దరం రాజకీయాల్లోకి ప్రవేశించాం. ఇప్పటి వరకు కలిసున్న మమ్మల్ని రాజకీయాలు వేరు చేస్తున్నాయి. ఆయన రాజకీయ వ్యూహాలేంటో నాకు తెలియదు. రాజకీయంగా నా సిద్ధంతాలు నాకున్నాయి. నేను మతాలను నమ్మను. ఏ మతంపై ప్రేమ లేదు. రజనీకాంత్‌తో నాకు మంచి అనుభవం ఉంది. కాబట్టి మేం రాజకీయంగా వేరైనా వాటి ప్రభావం మా బంధంపై పడదు' అని అన్నారు.
విశ్వరూపం2 సెన్సార్ పూర్తి..
కమల్ హాసన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'విశ్వరూపం 2'. 'విశ్వరూపం' చిత్రానికిది సీక్వెల్. పూజా కుమార్, ఆండ్రియా కథానాయికలుగా నటించారు. సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం 'శభాష్ నాయుడు' చేస్తున్న కమల్ 'భారతీయుడు 2'లోనూ నటించబోతున్నారు.