Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న నూతన చిత్రం 'టాక్సీవాలా'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో జీఏ2, యువి పిక్చర్స్ పతాకాలపై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ కథానాయికలు. త్వరలో చిత్ర ఫస్ట్‌లుక్ విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'విజరు దేవరకొండకి ఉన్న క్రేజ్, పాపులారిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కథను దర్శకుడు తయారు చేశారు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా హీరో పాత్రను డిజైన్ చేశారు. విజరు మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి. దర్శకుడు రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి. విజరు దేవరకొండ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందీ చిత్రం. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల నటనను దృష్టిలో పెట్టుకుని సినిమాను గ్రాండియర్‌గా నిర్మిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నెల 23న చిత్ర ఫస్ట్‌లుక్‌ను, మే 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయనున్నాం' అని అన్నారు. కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవిప్రకాష్, రవివర్మ, ఉత్తేజ్, విష్ణు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.