Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక 90వ ఆస్కార్ ఆవార్డు వేడుకల్లో దివంగత బాలీవుడ్ లెజెండ్స్ శ్రీదేవి, శశికపూర్ను స్మరించుకున్న విషయం విదితమే. తాజాగా వీరిద్దరికి మరో అరుదైన గుర్తింపు లభించనుంది. న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ ఇద్దరిని గుర్తు చేసుకోబోతున్నారు.
మే 7 నుంచి 12 వరకు న్యూయార్క్లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్లో గౌరవ సూచకంగా శ్రీదేవి నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రాన్ని, శశికపూర్ నటించిన 'ది హౌస్హోల్డర్', 'షేక్స్పీయర్ వాల్హా', 'హీట్ అండ్ డస్ట్' ఇంగ్లీష్ చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. శశి కపూర్ నటించిన ఈ చిత్రాలను హాలీవుడ్ నిర్మాణ సంస్థ మర్చంట్ ఐవరి నిర్మించింది.