Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన చిత్రం 'గులేబకావళి'. కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది.
ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. వివేక్ మెర్విన్ సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు ఆడియో లాంచ్ సోమవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బిగ్ సీడీను, ఎన్.శంకర్ ఆడియో సీడీలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, 'టైటిల్లోనే సక్సెస్ కనిపిస్తుంది. గతంలో ఇదే టైటిల్‌తో ఓ సినిమా విడుదలై అఖండ విజయం సాధించింది.ప్రభుదేవా మల్టీటాలెంటెడ్ పర్సన్. చిన్నా, పెద్ద సినిమాలకు తన వంతు సహకారాన్ని నిర్మాత మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు. ఆయన విడుదల చేస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలి' అని అన్నారు. 'మిస్టరీ, కామెడీ, సస్పెన్స్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఇలాంటి జోనర్ సినిమాలు చాలా వరకు పెద్ద విజయాలనే సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా సైతం విజయం సాధిస్తుంది' అని ఎన్.శంకర్ తెలిపారు. ''సింగం2' తర్వాత సినిమాలు చేయడం ఆపేద్దామనుకున్నా. సినిమా సక్సెస్ అయితే నెక్ట్స్ ఏంటని అడుగుతారు. ఫ్లాప్ అయితే ఎవరూ కనిపించరు. కానీ పది మందికి ఆదరణ చూపే ఇండిస్టీ ఇది. నాకు తమిళం రాకపోయినా ఈ సినిమా చూసి ఎంజారు చేశా. తెలుగు వారికి తప్పకుండా నచ్చుతుందనిపించి విడుదల చేస్తున్నాం. ఏప్రిల్ 6న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. 'దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. తెలుగు వారిని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా' అని చిత్ర దర్శకుడు కళ్యాణ్ చెప్పారు.