Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోటీ పత్రికలకు దీటుగా ప్రజల పత్రికగా విశేష పాఠకాభిమానాన్ని పొంది విజయవంతంగా నాలుగవ సంవత్సరంలోకి 'నవతెలంగాణ' అడుగిడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖులు తెలిపిన శుభాకాంక్షలు..
సమగ్ర సమాచారం..
మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంలో నవతెలంగాణ ముందుంటుంది. సినిమాతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలతోపాటు విద్య, వైద్యం, ఆర్యోగం, టెక్నాలజీ ఇలా వివిధ రంగాల్లో ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తుంది. అన్ని రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందిస్తున్న దిన పత్రిక నవతెలంగాణ నాలుగవ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నా శుభాకాంక్షలు.
- రాజేంద్రప్రసాద్ (హీరో)
నాకు బాగా నచ్చిన పత్రిక..
పిల్లలు, పెద్దలు, యూత్, మహిళలు ఇలా అందరికి కావాల్సిన అంశాలు, సమాచారాన్ని నవతెలంగాణ దిన పత్రికలో చూడొచ్చు. నాకు ఈ పత్రిక బాగా నచ్చుతుంది. ఇలానే అన్ని అంశాలపై విశ్లేషణాత్మక కథలను అందిస్తూ ప్రజలను ఎడ్యూకేట్ చేసే దిన పత్రికగా ఉంటుందని కోరుకుంటూ నవతెలంగాణ బృందానికి శుభాభివందనాలు.
- బ్రహ్మానందం (హాస్యనటుడు)
వాస్తవాలకు ప్రతిరూపం..
ఈ గ్లోబలైజేషన్ మాయా ప్రపంచంలో నవతెలంగాణ దిన పత్రిక వాస్తవాలకు ప్రతిరూపంగా నిలిచింది. పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ ప్రజాశక్తిగా అందరి దృష్టి ఆకర్షిస్తుంది. కార్పొరేట్ మీడియా దాచేస్తున్న వాస్తవాలను వెలికి తీస్తూ ప్రజలను మేల్కోలుపుతున్న నవతెలంగాణ మరింత నూతనత్వంలో మరిన్ని సంవత్సరాలు విజయవంతంగా కొనసాగాలని, ఆ దిశగా పాఠకులు ఆదరించాలని కోరుకుంటున్నా. పాఠకులకు కావాల్సిన తాజా వార్తలను అంతే నాణ్యతతో అందిస్తూ ముందుకు సాగాలి
- ఆర్.నారాయణమూర్తి (నటుడు, దర్శకుడు, నిర్మాత)
ప్రజల పత్రిక..
నిత్యం సమాజంలోని అసమానతలను, పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజలను చైతన్యం చేస్తూ జనం నాడిగా ముందుకు సాగుతుంది నవతెలంగాణ. ప్రజా సమస్యలకు పెద్ద పీట వేస్తూ, బహుజన సామాజిక న్యాయం కోసం పోరాడుతోంది. ప్రజల్లో మూఢవిశ్వాసాలను తొలగిస్తూ, వారిని ఎడ్యూకేట్ చేస్తూ, రాజకీయ చైతన్యం రగిలిస్తూ పాఠకులను ఆకట్టుకుంటున్న 'నవతెలంగాణ'కు శుభాకాంక్షలు
- తమ్మారెడ్డి భరద్వాజ (దర్శకుడు, నిర్మాత)
ప్రజా చైతన్య సారధి
ఉత్తమ ఆశయాలతో, ఉన్నత లక్ష్యాలతో సమాజ పురోగతికి, శ్రమజీవుల అభ్యున్నతికి అంకితమై ఈ మూడేండ్లు పని చేసింది నవతెలంగాణ. ప్రజలను చైతన్యపరిచే ఆయుధంగా పాలకుల వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన పనిచేసింది. గొప్ప రచనలు, వ్యాసాల ద్వారా ఎందరో అభ్యుదయ రచయితలను ప్రోత్సహించింది. వామపక్ష ప్రగతిశీల బడుగు బలహీన (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనరిటీ) వర్గాల ఐక్యత కోసం ఉద్యమించింది. తెలంగాణ ప్రజల సాంఘిక, రాజకీయ, ఆర్థిక సత్యాలకు నిలువెత్తు దర్పణంగా తెలుగు జాతి ఆదరాభి మానాలు పొందింది. ప్రజా ఉద్యమాల సందర్భంలో నిజాయితీగా, నిర్భయంగా అన్ని ఉద్యమాలకు ఊపునిచ్చింది. ఇది విప్లవ సంకేతం, ఇది శ్రామిక జన సంగీతం, ఇది ప్రగతిశీల వేదిక, చైతన్య దీపిక. సామాన్యుల పక్షాన గళమెత్తుతున్న నవతెలంగాణకు నా ప్రజాభి వందనాలు, విప్లవాభి వందనాలు
- మాదాల రవి (నటుడు)
నూతనత్వానికి మారుపేరు..
నవతెలంగాణ పేరులోనే నవతరం ఉంది. అందులోనే నూతనత్వమూ ఉంది. తెలంగాణ అనే పేరుతో దానికి అందం, శోభ సంతరించుకుంది. ప్రస్తుతం అన్నిటికంటే బాగా ఉధృతంగా దూసుకొస్తున్న ప్రజాపత్రికగా నవతెలంగాణ ఉందని భావిస్తున్నాను. నేను రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటాను. పత్రికా శైలి, భాష బాగా నచ్చింది. ఇలాగే దినదినాభివృద్ధి చెంది తెలుగు దిన పత్రికల్లో అగ్ర స్థానంలో నిలవాలని కోరుకుంటున్నాను
- రాజ్ కందుకూరి (దర్శకుడు, నిర్మాత)
ప్రజా చైతన్య యాత్ర..
విజయవంతంగా మూడు ఏండ్లు పాఠకులను అలరించిన నవతెలంగాణ దిన పత్రికకు నా అభినందనలు. పాఠకులకు వికాసాన్ని కలిగిస్తూ, ప్రజా చైతన్య యాత్రలో భాగంగా నాల్గవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నవతెలంగాణ పాఠకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి నా హృదయ పూర్వక అభినందనలు
- ఎన్.శంకర్ (దర్శకుడు)
అన్నింటికంటే ముందే..
సినీ పరిశ్రమలోని టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ప్రోత్సహిస్తూ సినీ ప్రేమికులకు ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలతో నవతెలంగాణ అలరిస్తోంది. 'షో' పేరుతో అంతర్జాతీయ సినిమాను తెలుగు పాఠకుడికి పరిచయం చేసి, విశేష పాపులారిటీని సొంతం చేసుకుంది. మేజర్ అప్డేట్స్ను అన్నింటికంటే ముందే అందిస్తూ తనకంటూ
ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. సక్సెస్‌ఫుల్‌గా 3 ఏండ్లు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా నవ తెలంగాణ టీమ్‌కు
నా బెస్ట్ విషెస్
- విజయ్‌దేవరకొండ (హీరో)