Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. పి.కృష్ణచైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ, 'నిరాడంబరంగా చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. విదేశాల నుంచి తిరిగి వచ్చాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. కొత్త పంథాలో సాగే చిత్రమిది. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాం' అని అన్నారు. 'రామ్‌కి చక్కగా సరిపోయే కథ కుదిరింది. స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్, అడ్వెంచరస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రముఖ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేయనున్నారు. అందరినీ మెప్పించే చిత్రమవుతుంది' అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెలిపారు.