Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సూర్య పెద్ద స్టార్ అయినప్పటికీ ఎలాంటి యాటిట్యూడ్ చూపించరు. ఆయన పర్ఫెక్ట్ జెంటిల్మెన్' అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. 'స్పైడర్' తర్వాత రకుల్ తెలుగులో ఇంకా ఏ సినిమాను అంగీకరించలేదు. తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అందులో భాగంగా సూర్య సరసన 'ఎన్జీకే' చిత్రంలో నటిస్తుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే చిత్రమిది.
సూర్య సరసన రకుల్, సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. సెల్వరాఘవన్ దర్శకుడు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల సూర్యతో కలిసి రకుల్ షూటింగ్లో పాల్గొంది. ఈ సందర్భంగా రకుల్ తన అనుభవాలను పంచుకుంటూ సూర్యను పొగడ్తలతో ముంచెత్తింది. 'సూర్య లాంటి స్టార్ హీరోతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయన పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్లో చాలా సింపుల్‌గా ఉంటారు. టైమ్‌కి షూటింగ్‌కి వస్తారు. అందరితోను కలిసి పోతారు' అని రకుల్ ప్రశంసించింది. డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతోపాటు రకుల్ ప్రస్తుతం కార్తీ, శివకార్తికేయన్, బాలీవుడ్లో అజరుదేవగణ్ వంటి హీరోల చిత్రాల్లో నటిస్తోంది.