Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సల్మాన్‌ఖాన్, అలి అబ్బాస్ జాఫర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'భారత్'. నిర్మాణదశలోనే పలు ప్రత్యేక ఆకర్షణలతో ఈ చిత్రం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం విదితమే. హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా ఉంటూ గత రెండేండ్లుగా బాలీవుడ్లో ఒక్క సినిమా కూడా చేయని ప్రియాంక ఈ చిత్రంలో నటించడం ఓ విశేషమైతే, ఇందులో మరో కథానాయికగా దిశాపటాని ఎంపికవ్వడం మరో విశేషం. అలాగే తాజాగా ఓ కీలక పాత్ర కోసం సీనియర్ కథానాయిక టబుని తీసుకున్నట్టు చిత్ర దర్శకుడు అలి అబ్బాస్ జాఫర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. 'ఎట్టకేలకు ఇది కుదిరింది. మీతో వర్క్ చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాను. లాట్స్ ఆఫ్ లవ్ టబు ' అంటూ దర్శకుడు ట్వీట్ చేశారు. గతంలో సల్మాన్‌ఖాన్ నటించిన పలు చిత్రాల్లో టబు మెరిసిన విషయం విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని వచ్చే ఏడాది ఈద్ పండుగ నేపథ్యంలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.