Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' పేరుతో
ఓ బయోపిక్ నిర్మితమవుతున్న విషయం విదితమే. వై.ఎస్.ఆర్గా మలయాళ సూపర్‌స్టార్ ముమ్మట్టి నటిస్తున్న ఈ చిత్రాన్ని మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. 70ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ చిల్లా, శశి దేవ్రెడ్డిసంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైఎస్సార్ సతీమణిగా 'బాహుబలి' ఫేమ్ అశ్రిత మేముగంటి నటిస్తున్న ఈ చిత్రంలో వైఎస్సార్ కూతురు షర్మిలగా సీనియర్ కథానాయిక భూమిక నటించనుందట. ఈ విషయమై చిత్రబృందం భూమికను సంప్రదించగా, ఇందులో నటించేందుకు ఆమె సుముఖంగా ఉన్నారని సమాచారం.
అలాగే వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి నటించబోతున్నారు. అయితే వైఎస్ జగన్‌గా ఎవరు నటిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. త్వరలోనే నటీనటుల పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనుంది.