Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజరు భూపతి దర్శకత్వంలో కెసిడబ్ల్యూ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న చిత్రం 'ఆర్ఎక్స్ 100'. 'యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ' అనేది ఉపశీర్షిక. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కీలక పాత్ర పోషించిన రావు రమేష్ మాట్లాడుతూ, 'కథను నమ్మి తీసిన చిత్రమిది. సరైన కథ లేకుండా ఎన్ని కష్టాలు పడ్డా ప్రయోజనం శూన్యం. రామ్కీ ఇందులో తండ్రి పాత్ర పోషించారు. ఆయన ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు దొరికారు' అని అన్నారు. 'డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది' అని రామ్కీ తెలిపారు. దర్శకుడు అజరు భూపతి చెబుతూ, 'ఈచిత్ర టైటిల్ వినగానే యారగెంట్ మనస్తత్వం గుర్తుకొస్తుంది. దూకుడు స్వభావం కలిగి యువకుడి కథ ఇది. అతను చేసిన పనులు ఇతరుల జీవితాల్లో ఎలాంటి కల్లోలాల్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో అతని ప్రేమ ఎలా సాగిందనే ఆసక్తికర కథాంశంతో రూపొందిస్తున్నాం. రియలిస్టిక్ సినిమాను కేవలం తమిళం, మలయాళం వాళ్లు మాత్రమే కాదు మనం కూడా తెరకెక్కించగలమని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రయోగాత్మక ప్రేమ కథగా ఇది విభిన్నమైన అనుభూతిని పంచుతుంది. జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. 'దర్శకుడు కథ చెప్పుతున్నప్పుడే సినిమా చూపించారు. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే చిత్రమిది. చాలా బాగా వచ్చింది' అని నిర్మాత అశోక్‌రెడ్డి చెప్పారు. హీరో కార్తీక్ చెబుతూ, 'హీరో, హీరోయిన్లు అని కాకుండా తెరపై పాత్రలే కనిపిస్తాయి. పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు సహజంగా ఉంటాయి. నిజాయితీగా చేస్తున్న చిత్రమిది' అని చెప్పారు.