Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవితేజ, మాళవిక శర్మ జంటగా
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్టీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజని తాళ్ళూరి నిర్మించిన 'నేల టిక్కెట్టు' చిత్రం నేడు(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ, 'సినిమా విడుదలకు సిద్ధమవడం హ్యాపీగా ఉంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనుకున్న విధంగా ఔట్పుట్ వచ్చింది. అందుకు సపోర్ట్ చేసిన నిర్మాత, రవితేజ, టీమ్ అందరికి థ్యాంక్స్. సినిమాలో ప్రతి సీన్ ఫన్ మేళవింపుతో ఉంటుంది. నేల టిక్కెట్టు నుంచి వచ్చిన వ్యక్తి లైఫ్ ఇది. టైటిల్ పెట్టడానికి కథకు లింక్ ఉంటుంది. అది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇందులో హీరో కలిసిన ప్రతి వ్యక్తిని రిలేషన్ చేసుకుంటూ ఓ ఫ్యామిలీని సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో తాను ఎంత మందికి దగ్గరయ్యేడనేది సినిమా. అలాగే బిజీ లైఫ్‌లో మరచిపోతున్న చాలా మంచి విషయాలను గుర్తు చేసే సినిమా అవుతుంది. నా మొదటి రెండు సినిమాలు అన్నపూర్ణ స్టూడియోలో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. మూడో సినిమా రామ్‌తో చేయడం హ్యాపీగా ఉంది. ఆయన రాజీపడకుండా నిర్మించారు. రవితేజతో పనిచేయడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. 'క్లాస్, మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన చిత్రమిది. రవితేజ నైస్ పర్సన్. ఆయన ఎనర్జీ లెవల్ అద్భుతం. ఆయనతో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాం. సోషియో ఫాంటసీ చిత్రమది. సెప్టెంబర్ చివరలో ప్రారంభమవుతుంది. ఇక ఓ వ్యక్తి ద్వారా పవన్ కళ్యాణ్ పరిచయమయ్యారు. నేను చేస్తున్న ఛారిటీ వర్క్‌కి ఆయన ఇంప్రెస్ అయ్యారు. అలా మేం ఫ్రెండ్స్ అయ్యాం. ఆయనకు నా సపోర్ట్ ఉంటుంది. నిర్మాతగా కొత్త జోనర్ సినిమాలు, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ సినిమాలు తీయాలనుంది. శుక్రవారం విడుదలవుతున్న 'నేల టిక్కెట్టు'ను ఆదరించాలని కోరుకుంటున్నా' అని నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు. హీరోయిన్ మాళవిక శర్మ చెబుతూ, 'సినిమా విడుదల కాబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉంది. రవితేజతో వర్క్ చేయడం అమేజింగ్. ఆయన ఎనర్జిటిక్, హంబుల్ పర్సన్. కళ్యాణ్ కృష్ణ కూల్‌గా అవుట్‌పుట్‌ను రాబట్టుకుంటారు. 'ఓసారి ట్రై చేశా..'తోపాటు టైటిల్ సాంగ్ నాకిష్టం. నాతొలి చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.