Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యా మీనన్ 'ప్రాణ' పేరుతో రూపొందుతున్న ప్రయోగాత్మక థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా మొత్తం ఒకే పాత్ర ఉండటం ఇందులో ప్రత్యేకత. మల్టీలింగ్వల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి వి కె ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దుల్కర్సల్మాన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సినిమాలో సౌండ్ కొత్తగా ఉంటుందట. అందుకు ఆస్కార్ విన్నింగ్ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి సింక్ సౌండ్ ఫార్మెట్లో సౌండ్ డిజైన్ చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో నిత్యామీనన్ చుట్టూ చిన్న పాప బొమ్మలుండటం సినిమాపై మరింత ఆసక్తి క్రియేట్ చేస్తోంది. దీంతోపాటు నిత్యా మీనన్ '9' అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు.