Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో విరాట్ కొండూరు, సిమ్రత్‌కౌర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'పరిచయం'. ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ,'పరిచయం టైటిల్ చాలా బాగుంది. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ చిత్రయూనిట్‌కు మంచి విజయం రావాలని ఆశిస్తున్నాను. ఈ సినిమాని మొదటిరోజే చూస్తాను' అని చెప్పారు. 'లవ్ ఎంటర్టైన్మెంట్తోపాటు స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. మా చిత్రానికి నాని, శర్వానంద్, సాయిపల్లవి, హరీష్‌శంకర్, మారుతి తదితరులు అందిస్తున్న సపోర్ట్‌కి కృతజ్ఞతలు' అని దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా తెలిపారు. 'ఓ మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగిడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతర్లీనంగా మంచి సందేశం ఉన్న ప్రేమకథా చిత్రమిది. ఇటీవల ఫస్ట్‌కాపీ చూశాను. అద్భుతంగా అవుట్‌పుట్ వచ్చింది. ఈనెల 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని నిర్మాత రియాజ్ అన్నారు. 'ఎనిమిదేండ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ సినిమాతో నా కల నెరవేరింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని విరాట్ కొండూరు చెప్పారు.