Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్‌తరుణ్, రిద్దికుమార్ జంటగా నటించిన చిత్రం 'లవర్'. అనీష్‌కృష్ణ దర్శకత్వంలో హర్షిత్ ఈ సినిమాను నిర్మించారు. దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో శిరీష్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల సంగీత దర్శకుడు అంకిత్ తివారీ, తనీశ్, సాయికార్తీక్, జె.బి. తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయికార్తీక్ మాట్లాడుతూ, 'ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు హిట్ అయ్యాయి. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది' అని చెప్పారు. 'తెలుగులో నా తొలి చిత్రమిది. ఇందులో రెండు పాటలు కంపోజ్ చేశాను. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని మరో సంగీత దర్శకుడు అంకిత్ తివారీ తెలిపారు. ''అలా ఎలా' సినిమా తర్వాత మూడేండ్ల గ్యాప్ వచ్చింది. అయితే ఈ సినిమాని ఇంకొంచెం ముందు చేస్తే మా నాన్నగారు చూసేవారు. ఆయనిప్పుడు లేకపోవడం చాలా బాధగా ఉంది. ఈ సినిమాను దిల్‌రాజు చాలా ప్యాషనేట్‌గా చేశారు. నా కథకి అనుగుణంగా సమీర్‌రెడ్డి మంచి విజువల్స్ అందించారు. సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళారు' అని దర్శకుడు అన్నారు. 'సోలో నిర్మాతగా ఇది నా తొలిచిత్రం. మా బాబారు వాళ్ళ సపోర్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాను. రాజ్‌తరుణ్ చాలా కేర్ తీసుకుని ఈ సినిమా చేశారు. అలాగే రిద్ది కుమార్ తెలుగు నేర్చుకుని ఈ సినిమా చేసింది' అని హర్షిత్‌రెడ్డి తెలిపారు. '15 సంవత్సరాల్లో 27 సినిమాలు చేశాం. అందులో 22 సక్సెస్ఫుల్ అయ్యాయి. 5 వర్కవుట్ అయ్యాయి. ఇది మా బ్యానర్లో వస్తున్న 28వ సినిమా. 'కేరింత' తర్వాత మేం చేస్తున్న మరో చిన్న సినిమా ఇది. నిర్మాతగా హర్షిత్‌కి తొలి సినిమా ఇది. నా తొలి సినిమాకి కూడా నేనింత నెర్వస్‌గా ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమా విషయంలో కొంచెం నెర్వస్‌గానే ఫీలవుతున్నాను. అందరూ హార్డ్ వర్క్ చేసి, అద్భుతమైన అవుట్‌ఫుట్ ఇచ్చారు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని దిల్‌రాజు అన్నారు. 'అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది. ఈ సినిమా మాకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం' అని నాయకానాయికలు తెలిపారు.