Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే. పెళ్ళి కుదిరిన రోజు నుంచి పెళ్ళి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా 'హ్యాపి వెడ్డింగ్'లో చూపించాం' అని దర్శకుడు లక్ష్మణ్ కార్య అన్నారు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'హ్యాపి వెడ్డింగ్'. త్వరలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'పెళ్ళికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అనుభవం ఉంటుంది. దానికి ప్రతిరూపమే ఈ చిత్రం. ప్రతి ప్రేక్షకుడు తమనితాము చూసుకునేలా ఈ సినిమా రూపొందించాం. ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. శక్తికాంత్ మ్యూజిక్, ఎస్.ఎస్.థమన్ రీరికార్డింగ్, బాల్‌రెడ్డి కెమెరా వర్క్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ప్రీ వెడ్డింగ్ పేరుతో రాబోయే శనివారం (ఈనెల 21) గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 28న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం' అని అన్నారు. నరేష్,మురళీవర్మ, పవిత్ర లోకేష్, తులసి, మధుమణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.