Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయ్ శంకర్ హీరోగా రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా దర్శకుడు చంద్రసిద్ధార్థ్ 'ఆటగదరా శివ' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలోని 'ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే.. ' అంటూ సాగే తాత్విక పాటను ఇటీవల పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ పాటలోని చైతన్య ప్రసాద్ సాహిత్యం నాకు బాగా నచ్చింది. వాసుకి వైభవ్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర హీరో ఉదరు శంకర్ నాకు చిన్నపట్నుంచి తెలుసు. వాళ్ళ నాన్న శ్రీరామ్ మాకు ఇంగ్లీష్ లెక్చరర్. ఆధ్యాత్మిక గురువు కూడా. 'గోకులంలో సీత' సినిమా నుంచి ఉదరుని చూస్తున్నా. తను ఉరిశిక్ష పడ్డ ఖైదీ జీవితానికి సంబంధించిన కథాంశంతో ఉన్న ఈ చిత్రంలో నటించారు. డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ రూపొందించిన 'ఆ నలుగురు' వంటి చిత్రాలు యూనిక్‌గా ఉంటాయి. ఈ చిత్ర విజువల్స్ కొత్తగా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఉదరు శంకర్ రెగ్యులర్ హీరోలా కాకుండా ఓ క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం నాకు బాగా నచ్చింది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు.
'పవన్ కళ్యాణ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు సమయాన్ని కేటాయించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఆయనకు నేను వీరాభిమానిని. నేను హీరోగా పరిచయమవుతున్న సినిమాలోని పాటను ఆయన విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. దర్శకులు చంద్ర సిద్ధార్థ మంచి ఎమోషనల్ టచ్‌తో ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్లా తెరకెక్కించారు. కల్ట్, రగ్డ్, ఎమోషనల్, ఫీల్‌గుడ్ చిత్రమిది. కన్నడలో దొడ్డన్న అనే పెద్ద నటుడు ఈ సినిమాలో నాతో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామని ఫీల్ అవుతారు' అని ఉదరు శంకర్ తెలిపారు.