Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో సమంత, నాగచైతన్యల జోడీకి మంచి క్రేజ్ ఉంది. 'ఏ మాయ చేసావె', 'ఆటోనగర్ సూర్య', 'మనం' చిత్రాలతో ఈ జోడీ తెరపై మెస్మరైజ్ చేశారు. పెళ్ళి తర్వాత తొలిసారి సమంత, నాగచైతన్య జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నెల మూడో వారంలో రెగ్యులర్ షూటింగ్కు వెళ్తుంది. తాజాగా ఈ సినిమాకు 'మజిలీ' అనే ఆసక్తికర టైటిల్ వినిపిస్తోంది. సమంత, నాగచైతన్యల నూతన చిత్రానికి ఇదే టైటిల్ అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. భార్యభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' చిత్రాల్లో నటిస్తున్నారు. 'శైలజా రెడ్డి అల్లుడు' ఈ నెల 31న విడుదల కానుంది. సమంత తెలుగులో 'యూటర్న్'లో నటిస్తున్నారు.