Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరో పంటి', 'బాఘీ', 'ఏ ఫ్లయింగ్ జాట్', 'మున్నా మైఖేల్', 'బాఘీ 2' చిత్రాలతో యాక్షన్ హీరోగా బాలీవుడ్లో ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న టైగర్ షరాఫ్ త్వరలోనే హాలీవుడ్
ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. ప్రస్తుతం 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2', 'రాంబో' చిత్రాల్లో నటిస్తున్న ఆయనతో హాలీవుడ్ నిర్మాత లారెన్స్ కాసనాఫ్ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముందని తెలుస్తోంది. ఆ సినిమా కూడా పూర్తి యాక్షన్ నేపథ్యంలోనే ఉంటుందట.