Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విజయ్ కథానాయకుడిగా నటించిన 'సర్కార్' చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. టీజర్‌కు వస్తున్న హెవీ రెస్పాన్స్‌తో సినిమాపై తెలుగునాట కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి' అని అంటున్నారు నిర్మాత అశోక్ వల్లభనేని. విజరు, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరో, హీరోయిన్లుగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సర్కార్'. సన్ పిక్చర్స్్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మిస్తున్న చిత్రమిది. ఇటీవల 'నవాబ్'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నిర్మాత అశోక్ వల్లభనేని ఈ చిత్ర తెలుగు హక్కుల్ని ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసుకున్నారు. టీజర్‌కి వస్తున్న స్పందన గురించి నిర్మాత అశోక్ వల్లభనేని మాట్లాడుతూ, 'ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఎ.ఆర్.మురుగదాస్. కమర్షియల్ అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సమపాళ్ళలో తెరకెక్కించగల దిట్ట. అలాగే సందేశాత్మక చిత్రాల రూపకర్త కూడా. వైవిధ్యమైన కథలతో ట్రావెల్ చేసే విజరుకు మురుగదాస్‌లాంటి దర్శకుడు దొరికితే అభిమానులకు పండగే పండగ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో 'తుపాకీ', 'కత్తి' వంటి విజయవంతమైన చిత్రాలొచ్చాయి. ఇప్పడు ఈ కాంబినేషన్ మళ్ళీ 'సర్కార్'తో రిపీట్ అవుతోంది. ఇక సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి విజయవంతమైన కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఫస్టలుక్, పాటలకి మంచి స్పందన లభించింది. అలాగే ఇటీవల తెలుగులో విడుదల చేసిన టీజర్‌కు అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు అనువాద కార్యక్రమాలు ఏకధాటిగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీపావళి కానుకగా ఈచిత్రాన్ని నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం' అని చెప్పారు.