Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమంత్, అంజు కురియన్ హీరోహీరోయిన్లుగా 'ఇదంజగత్' చిత్రంలో నటిస్తున్నారు. అనీల్ శ్రీకంఠం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'డిసెంబర్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. సుమంత్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆడియెన్స్‌ను సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు' అని అన్నారు.