Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేసన్ మమోవా, అంబర్ హియర్డ్ జంటగా నటించిన చిత్రం 'అక్వామేన్'. జేమ్స్ వాన్ దర్శకత్వంలో వార్నర్ బ్రదర్స్‌కు చెందిన డి.సి.కామిక్స్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగులో 'సముద్రపుత్రుడు' పేరుతో ఎన్వీఆర్ సినిమా పతాకంపై ఎన్వీప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఎన్వీప్రసాద్ మాట్లాడుతూ, 'యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్ చిత్రమిది. జేసన్ మమోవా టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. జేసన్ ఫ్రెండ్ మేర పాత్రలో అంబర్ కనిపిస్తారు. 'ది కంజురింగ్ 1, 2', 'ప్యూరియస్ 7' వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన జేమ్స్ వాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇది అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది. చైనాలో విడుదలై మూడు రోజుల్లో వంద మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికా కంటే ముందుగానే మన ఇండియాలో విడుదల కాబోతుంది. తెలుగులో ఈ నెల 13 సాయంత్రం ప్రీమియర్ షోలతోపాటు సినిమాను ఈనెల 14న భారీగా విడుదల చేస్తున్నాం. ఇలాంటి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇది చిన్న సైజు 'బాహుబలి'లా మెప్పిస్తుంది. సముద్రంలో సన్నివేశాలు థ్రిల్ చేస్తాయి' అని అన్నారు.