Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ ధోరణిలో మార్పు రావాల్సిందే..
'మంచి మనసు లేకపోతే కనిపించే పై అందం కూడా వ్యర్థమే. తెల్లటి చర్మ రంగు కంటే గొప్ప అదే మనకు అందాన్నిస్తుంది' అని అంటోంది తమన్నా. చిత్ర పరిశ్రమలో తమన్నాని ఆమె అభిమానులంతా 'మిల్కీ బ్యూటీ' అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అలా పిలిచినప్పుడు మీ ఫీలింగ్ ఏంటీ? అని తమన్నాని ఇటీవల మీడియా ప్రశ్నించింది. దీనికి తమన్నా స్పందిస్తూ, 'ఈ పదం విన్నప్పుడు నాకేమాత్రం గర్వంగా అనిపించదు. చర్మం రంగును బట్టి మన స్వభావాన్ని, మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం నాకు నచ్చదు. నేను ఫెయిర్ స్కిన్‌తో జన్మించినప్పటికీ నల్లదనాన్నే ఎక్కువగా ఇష్టపడతా. సినిమాల్లో డార్క్ తరహా పాత్రల్లో నటించమంటే మరో ఆలోచన లేకుండా ఓకే చేస్తా. నేను అత్యద్భుతంగా ఏదో చేస్తానని కాదు, కానీ సినిమాటిక్ ఆలోచనను బ్రేక్ చేయాలనుకుంటాను.
హీరోయిన్లు ఇలా తెల్లటి చర్మంతోనే ఉండాలనే ఆలోచనలో మార్పు రావాలి. స్కిన్‌టోన్‌ను బట్టి అందాన్ని కొలిచే విధానాన్ని, వారిని ట్రీట్ చేసే ధోరణిలో మార్పు రావాలి. ఐదు భిన్న షేడ్స్ ఉన్న పాత్రలో త్వరలోనే ప్రేక్షకులకు కనిపించబోతున్నాను. ఆ సినిమా గురించి, ఆ పాత్ర గురించి ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్' అని చెప్పింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో 'సైరా నరసింహారెడ్డి', 'ఎఫ్2', 'దట్ ఈజ్ మహాలక్ష్మి', తమిళంలో 'దేవి 2'లో నటిస్తుంది. 'సైరా నరసింహారెడ్డి', 'దేవి 2'లో డార్క్ తరహా పాత్రల్లో కనిపించనుందట. ఇక మరోవైపు బాలీవుడ్ 'క్వీన్' రీమేక్‌గా వస్తున్న 'దట్ ఈజ్ మహాలక్ష్మి' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 21న విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.
వెంకటేష్ సరసన నటించిన 'ఎఫ్ 2' చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.