Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షయ్ కుమార్ మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు.
గతంలో ఆయన 'భూల్ భులయ్యా' చిత్రంలో నటించి అందర్ని భయపెట్టిన విషయం విదితమే. ప్రస్తుతం రాఘవ లారెన్స్ దర్శకత్వంలో నయా హర్రర్ సినిమా చేసేందుకు అక్కీ గ్రీన్ సిగల్ ఇచ్చారట. రాఘవ లారెన్స్ 'ముని', 'కాంచన', 'గంగ' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం 'కాంచన 3'ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాల కథని ఆధారంగా చేసుకుని బాలీవుడ్లో అక్కీ హీరోగా ఓ సినిమాని రూపొందించేందుకు లారెన్స్ ప్లాన్ చేశారట. స్క్రిప్ట్ విన్న అక్కీ ఇప్పటికే పచ్చ జెండా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 'కాంచన' సిరీస్ సినిమాలతో పోల్చితే ఇది అనేక మలుపులతో రివేంజ్ డ్రామాగా సాగుతుందట.
ఏప్రిల్లో ప్రారంభించబోయే ఈ చిత్రంలో అక్షరుతోపాటు భారీతారాగణాన్ని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. 'మిషన్ మంగళ్', 'గుడ్న్యూస్', 'కేసరి', 'హౌస్ఫుల్ 4' వంటి తదితర చిత్రాల్లో అక్కీ నటిస్తున్నారు.