Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సంగీతం పట్ల దర్శకుడు అట్ల్లీకి ఉన్న పరిజ్ఞానం అద్భుతమైనది. చాలా సెలక్టీవ్‌గా ఉంటారు. ఆయనలో నాకు నచ్చే అంశమదే' అని దర్శకుడు అట్ల్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్. విజయ్ హీరోగా అట్లీ రూపొందించిన 'తెరి', 'మెర్సల్' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్ హిట్ కోసం మరోసారి కలిసి పని చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా అట్లీ గురించి రెహ్మాన్ మాట్లాడుతూ, 'ఇలాంటి ఓ కథకి హాలీవుడ్‌లోని ఓ చిత్రానికి సంగీతం సమకూర్చా. దక్షిణ భారతదేశంలోనే ఇదో కొత్త రకమైన సినిమా. మన దగ్గర కూడా ఇదే మొదటిసారి. అట్లీకి సంగీతం పట్ల మంచి అవగాహన ఉంది. నా పాత సంగీత ఆల్బమ్స్ అన్నింటినీ విన్నారు. వాటిలోని ఓ ట్యూన్‌ని చెప్పి, అదే విధంగా కావాలని అడిగాడు. ఇలా అడిగే దర్శకులంటే నాకు బాగా ఇష్టం. 'ఏదో పాట అడిగాం..తీసుకున్నాం' అని వెళ్ళకుండా ప్రతి ట్యూన్‌ని సన్నివేశానికి కనెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటాడు. ఆయనలో ఉన్న ఈ లక్షణం నాకు బాగా నచ్చింది. అట్లీ మాదిరిగా సంగీత పరిజ్ఞానం ఉన్న దర్శకులు చాలా అరుదుగా ఉంటారు' అని తెలిపారు.