Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డోలింకి భీమేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో సూర్య కిరణ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమామృతం'. ఆయనే హీరోగా, ప్రజ్ఞ కథానాయికగా నటిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'యదార్థ సంఘటన ఆధారంగా, కాలేజ్ నేపథ్యంలో సాగే వినోదాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయ్యింది. తాజా షెడ్యూల్ను ఈ నెలలోనే ప్రారంభిస్తాం. ఇందులోని ఆరు పాటలను శ్రీకాంత్, ఉమ ఆలపించగా రికార్డింగ్ చేశాం. వేసవి కానుకగా సినిమాని విడుదల చేస్తాం' అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: తిరుమల్. కథ, మాటలు, పాటలు, డాన్స్, సంగీతం, దర్శకత్వం, నిర్మాత: డోలింకి భీమేశ్వరరావు.