Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియాశరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'నరకాసురుడు'. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న 'నరకాసురన్' చిత్రానికిది తెలుగు వెర్షన్. ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఫస్ట్ లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. 'ఫస్ట్‌లుక్‌లో అందరు చాలా ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా సినిమా సాగుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ వేసవిలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం' అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఆత్మిక, ఇంద్రజిత్ సుకుమారన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాన్ ఏతాన్ యోహాన్, కెమెరా: సుజిత్ సారంగ్, ఎడిటర్ అండ్ డీఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్, ఆర్ట్: శివశంకర్.