Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యేక పాటలకి తమన్నా ఇప్పుడో బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారు. 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు', 'జాగ్వర్', 'జై లవకుశ', 'కే జీ ఎఫ్' వంటి తదితర చిత్రాల్లోని స్పెషల్ సాంగ్స్‌లో తనదైన స్టెప్పులతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేశారు. అంతేకాదు ఆయా సినిమాలకి స్పెషల్ మైలేజ్‌ని సైతం తీసుకొచ్చిన క్రెడిట్ కూడా తమన్నాదే . ఈ నేపథ్యంలో తమ 'బుర్రకథ' చిత్రంలో తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్‌ని చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
ఆది సాయికుమార్, నైరా షా, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో 'బుర్రకథ' సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. స్పెషల్ సాంగ్స్‌లో తమన్నాకి ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా ఆమెను చిత్ర యూనిట్ సంప్రదించిందట. కథ, కథనంతోపాటు ఈ ప్రత్యేక పాట వచ్చే సందర్భం తమన్నాకి బాగా నచ్చాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌కి తమన్నా పచ్చజెండా ఊపినట్టేనని అందరూ భావిస్తున్నారు. మరో స్పెషల్ సాంగ్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసేందుకు రెడీ అవుతున్న తమన్నా ప్రస్తుతం తెలుగులో 'దట్ ఈజ్ మహాలక్ష్మి', 'సైరా నరసింహారెడ్డి', తమిళంలో 'దేవి 2', కలైమానె' చిత్రాల్లో నటిస్తోంది.