Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్‌లోని పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాదులు గురువారం చేసిన దాడి యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భిన్న పరిశ్రమలకు చెందిన సినీ సెలబ్రిటీలు సైతం ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు. వీర మరణం పొందిన జవాన్లకి సోషల్ మీడియా వేదికగా ఆవేదనని వ్యక్తం చేస్తూ సంతాపాలు తెలియజేశారు.ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధగా అనిపించింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా - మహేష్‌బాబు
ప్రతి జవాన్ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఇది చాలా బాధాకరమైన రోజు - అల్లు అర్జున్
మన కుటుంబాలను కాపాడటానికి వారి ప్రాణాలను త్యాగం చేసిన
జవాన్లని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది - సల్మాన్ ఖాన్
సైనికులపై ఇంత భీకర దాడిని నమ్మలేకపోతున్నా. మీ త్యాగం మరచిపోలేము.
గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా - అక్షరు కుమార్
ఈ ఘటన చాలా కోపానికి, బాధకి గురిచేస్తుంది. మిలియన్ల ఆలోచనలు నాలో కలుగుతున్నాయి. ప్రభుత్వం దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతుందని ఆశిస్తున్నా - అనుపమ్ ఖేర్
మరో సర్జికల్ స్ట్రైక్ కావాలి - పూరీ జగన్నాథ్
సీఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి ఓ పిరికి పంద చర్య. చాలా కోపంగా, బాధగా ఉంది - రణ్వీర్ సింగ్
ఈ దారుణం పట్ల ఎంతో బాధపడుతున్నా - సూర్య
ఈ ఘటన షాక్‌కి గురిచేస్తుంది. అసహ్యం ఎప్పటికీ సమాధానం కాదు - ప్రియాంక చోప్రా
ఉగ్రవాదులు ఇంత దారుణ ఘటనకి ఒడిగడతారని అనుకోలేదు. అత్యంత బాధాకరం - గోపీచంద్
ఇది చాలా దారుణమైన ఘటన. జవాన్ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి - అనుష్క
చాలా బాధాకరం. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలి - కాజల్
దాడి ఘటన గురించి విని షాక్ అయ్యా. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలు ధైర్యంగా ఉండాలి - రానా
ఎంత దారుణం. ప్రేమికుల రోజు జరుపుకొంటున్న వేళ ద్వేషం తలెత్తింది - అభిషేక్ బచ్చన్
ఎందరో జవాన్ల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలకి తీరని శోకం మిగిల్చిన వారిని క్షమించకూడదు.
ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి వారి కుటుంబాలకి ప్రసాదించాలని కోరుకుంటున్నా.
వారి కోసం ప్రతి భారతీయుడు ప్రార్థిస్తుంటాడు - సోనూ సూద్
వీరితోపాటు అజరు దేవగన్, వరుణ్ ధావన్, ప్రీతి జింటా, కరణ్ జోహార్, హేమా మాలిని, రితేష్ దేశ్‌ముఖ్, మంచు మనోజ్, అర్జున్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్పారు, కృతి సనన్, స్వరా భాస్కర్, సునీల్ శెట్టి, అల్లు శిరీష్, అల్లరి నరేష్ తదితరులు ఘటనని ఖండిస్తూ జవాన్లకి సంతాపం తెలిపారు.