Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ రామ్, నివేదా థామస్, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా కె.వి. గుహన్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న చిత్రం '118'. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, 'ట్రైలర్లోనే సినిమా కథ మొత్తం ఉంటుంది. నివేదా చుట్టూ సినిమా కథ తిరుగుతుంది. ఆమె అద్భుతంగా నటించింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు కంటతడి పెట్టించింది. దర్శకుడు గుహన్ మంచి విజన్‌తో సినిమాని తెరకెక్కించారు. మేకింగ్, సీన్స్‌ని నడిపించిన తీరు అద్భుతం. ఫ్రీడమ్ తీసుకుని సన్నివేశాల్లో ఫీలై నటించమనేవారు. గొప్ప సబ్జెక్ట్ ఇది. మహేష్ మా ఫ్యామిలీ. కథ ఎగ్జైట్ చేయడంతో మొదట సినిమాని మా బ్యానర్లో చేద్దామనుకున్నా. కానీ మహేష్ కూడా నాలాగే ఎగ్జైటై తన బ్యానర్లో చేస్తానన్నాడు. శేఖర్ చంద్ర అద్భుతమైన ఆర్ఆర్, మ్యూజిక్ అందించారు. కచ్చితంగా సినిమా ఆకట్టుకుంటుంది. మాకు నమ్మకం ఉంది' అని అన్నారు.
'తెలుగులో ఇటీవల మంచి కథలు వస్తున్నాయి. అందులో నేను కూడా భాగం కావాలనుకుంటున్నా. సీట్ ఎడ్జ్ థిల్లర్ చిత్రమిది. ప్రతి ఒక్కరూ సినిమా కోసం సోల్ పెట్టారు. నివేదా పాత్ర బాధ్యతగా ఉంటుంది. తను అంతే రెస్పాన్సిబుల్‌గా నటించింది. కళ్యాణ్‌రామ్ సెట్‌కి వెళ్లే ముందు స్క్రిప్ట్ చూసుకుంటారు. వెళ్ళాక ఎలా చేసేందుకైనా సిద్ధంగా ఉంటారు. చాలా సపోర్టివ్. సినిమా బాగా వచ్చేందుకు తపించేవారు. నిర్మాత మహేష్ డబ్బే కాదు, అంతకు మించి సపోర్ట్ చేశారు. కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం' అని దర్శకుడు గుహన్ తెలిపారు. నిర్మాత మహేష్ కోనేరు చెబుతూ, 'ఈ సినిమా చాలా స్పెషల్. నేను నిర్మించినందుకు గర్వంగా ఉంది. కళ్యాణ్ రామ్ నటన, గుహన్ టేకింగ్, నివేదా అభినయం, శేఖర్ చంద్ర సంగీతం, రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. మార్చి 1న విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.
'ఇది నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. అందరు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సినిమాలో చాలా పొటెన్షియల్ ఉంది. '118' ఏంటనేది తెరపై చూస్తే అర్థమవుతుంది. గుహన్ చాలా సర్ప్రైజ్ చేస్తారు' అని నివేదా థామస్ తెలిపారు. శేఖర్ చంద్ర చెబుతూ, 'ఈ సినిమా చేయడం లక్కీగా, గర్వంగా భావిస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్‌కి స్కోప్ ఉన్న చిత్రం. నేర్చుకునేందుకు చాలా స్కోప్ ఉంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్ట్‌లు ట్రైలర్ గురించి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం విశేషం.