Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'లో అలియా భట్ ఓ కథానాయికగా ఎంపికైన విషయం విదితమే. గురువారం ఈ విషయాన్ని రాజమౌళి ప్రకటించారు. ఈ సందర్భంగా అలియా భట్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'ఈ రోజు నేను చాలా గొప్పగా ఫీలవుతున్నా. అద్భుతమైన నటులతో, మిగతా బృందంతో కలిసి అందమైన ప్రయాణాన్ని ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తానా? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఈ చిత్రంలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ రాజమౌళి సర్' అని పేర్కొన్నారు. అలియా పోస్ట్‌కి రాజమౌళి స్పందిస్తూ, ''తోటి నటీనటులతో పోటీపడుతూ, అంచనాలు పెంచేస్తూ ఎంతో కష్టపడతావని విన్నాను. ఇప్పుడు నా సినిమాలో అదే నిబద్ధతని చూపించబోతున్నందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని రాజమౌళి రీ ట్వీట్ చేశారు. అలియా ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రధారి అయిన రామ్‌చరణ్ సరసన నటిస్తోంది.