Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దేవ్ డీ' సినిమా తర్వాత ఆఫర్స్ రావడానికి రెండేండ్లు పట్టింది. కానీ నేను ఆశలు వదులుకోలేదు' అని కల్కీ కొచ్లిన్ అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'చదువుకునే రోజుల నుంచే నటిని కావాలనే ఆశ, కోరిక ఉండేది. అది రోజు రోజుకి బలపడింది. నటనలో శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్ళాను. వెయిటర్గానూ పనిచేశా. తిరిగికొచ్చి అనేక ప్రయత్నాలు చేశా. చాలా మంది నన్ను తిరస్కరించారు.ఎన్నో ప్రయత్నాల ఫలితంగా 'దేవ్ డీ'లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో ఆఫర్ రావడానికి రెండేండ్లు పట్టింది. ఆ టైమ్లో సొంతంగా కథలు రాస్తూ వచ్చాను. 2011లో నాలుగు సినిమాల్లో నటించా. ఆ తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి' అని తెలిపింది. పెళ్ళి బ్రేకప్ గురించి చెబుతూ, 'విడాకుల తర్వాత నాపై నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంటి నుంచి ఏ అబ్బాయితో వెళ్ళినా అతనితో డేటింగ్లో ఉందంటూ రాసేవారు. అది నన్ను బాధించింది' అని తెలిపింది. ప్రస్తుతం ఆమె 'స్కాలర్షిప్' చిత్రంతోపాటు 'మేడ్ ఇన్ హెవెన్' అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది.