Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింగ్, పూర్వి టక్కర్ జంటగా సర్కడమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సర్కడమ్ స్టోరీస్ పతాకంపై శేషగిరిరావు నిర్మిస్తున్న చిత్రం 'ఓన్లీ నేను'. 'బట్ నాట్ ఎలోన్' అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు సర్కడమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, 'బేసిక్‌గా నేను ఓ వ్యాపారవేత్తని. కొంత మంది పెద్ద వాళ్ళ సలహా మేరకు నేను సర్కడమ్ స్టోరీస్ అనే బ్యానర్‌ని స్థాపించాను. ప్రేమ, ఫ్యామిలీ, కామెడీ ప్రధానంగా ఎక్కువగా సినిమాలొస్తాయి. ప్రపంచం మొత్తంలో టాప్‌టెన్ బిలియనీర్స్‌లో మహిళలు లేకపోవడం అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఉమెన్ ఎంపవర్ ఎక్కడుంది అని ఓ అందమైన, తెలివైన అమ్మాయికి బాధ కలుగుతుంది. నేనేందుకు ఆ స్థానంలో ఉండకూడదని గోల్‌గా పెట్టుకుంటుంది. అందుకు సొంత స్నేహితురాలిని సైతం చంపడానికి వెనకాడదు. ఈ క్రమంలో ఏం జరిగిందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. మా చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని కోరుతున్నా' అని అన్నారు. 'ఈ చిత్రం ద్వారా సర్కడమ్ శ్రీనివాస్‌తో భాగస్వామ్యం కావడం హ్యాపీగా ఉంది. డిసెంబర్ 6కి సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. ఇందులో ఎన్నో ట్విస్టులుంటాయి. చాలా కొత్తగా ఉంటుంది' అని నిర్మాత శేషగిరిరావు చెప్పారు. హీరో చింగ్ చెబుతూ, 'నేను లాయర్ని. నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని తెలిపారు. 'ఈ సినిమాలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. సినిమా కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నా' అని హీరోయిన్ పూర్వి చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు బాలచందర్, మైరా అమిటి తదితరులు పాల్గొన్నారు.