Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్ర పరిశ్రమలో దర్శకుడు రాజ్ కుమార్ హిరానీది ప్రత్యేక శైలి. వినోదం, సందేశం మేళవించి సెటైరికల్‌గా సినిమాలు రూపొందించడం ఆయన స్పెషాలిటీ. 'మున్నాభాయి ఎం.బి.బి.ఎస్', 'లగే రహో మున్నాభాయి', '3 ఇడియట్స్', 'పీకే' చిత్రాలు ఈ కోవలోనే రూపొంది ఘన విజయం సాధించాయి. గతేడాది 'సంజు' చిత్రంతో తన ప్రతిభని చాటుకున్నారు. సంజరు దత్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఆయన పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. ఇది బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లని రాబట్టింది. అయితే ఇటీవల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిరానీతో ఓ సినిమా చేసేందుకు రణ్‌బీర్ సిద్ధమైనట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు హిరానీ గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. 'మీరు అమేజింగ్ ఫిల్మ్ మేకర్, అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఇది నా గుండె లోతుల్లో నుంచి చెబుతున్నా' అని రణ్‌బీర్ పేర్కొన్నారు. అంతేకాదు హిరానీతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం రణ్‌బీర్ 'బ్రహ్మాస్త్ర', 'శంషేరా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో దీపికాతో కలిసి రణ్‌బీర్ వేసిన డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.