Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య సినిమా విడుదలై ఏడాది పైనే అవుతుంది. ప్రస్తుతం ఆయన 'ఎన్జీకే' చిత్రంలో నటిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందింది. ఇది త్వరలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతోపాటు యాక్షన్ థ్రిల్లర్ 'కాప్పాన్'లో నటిస్తున్నారు. కె.వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. మోహన్‌లాల్, ఆర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మరో యాక్షన్ సినిమా చేసేందుకు సూర్య గ్రీన్ సిగల్ ఇచ్చారు. అజిత్ హీరోగా వరుసగా 'వీరం', 'వేదాలం', 'వివేగం', 'విశ్వాసం' చిత్రాలు రూపొందించి విజయాలను అందుకున్న శివ దర్శకత్వంలో పవర్ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా ఓ సినిమా చేయనున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందబోయే తొలి సినిమా ఇది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న రెండు చిత్రాలు పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. 'ఎన్జీకే' చిత్రంలో సూర్య సరసన రకుల్ ప్రీంత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తుండగా, 'కాప్పాన్'లో సాయేషా జోడీగా నటించారు.