Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్న ఇమేజ్ ఉన్న కాంబినేషన్లో సినిమా అంటే దానిపై ఇండిస్టీ వర్గాల్లోనే కాదు, ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో ఊహించని, ఓ క్రేజీ కాంబినేషన్లో సినిమా సెట్ కాబోతుందని తెలుస్తుంది. విజువల్ వండర్స్‌కి, గ్రాండియర్‌కి కేరాఫ్‌గా నిలిచే శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చిరంజీవి కోసం శంకర్ ఓ శక్తివంతమైన స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నారట. 'భారతీయుడు 2' తర్వాత ఆ సినిమా ఉంటుందని, అల్లు అరవింద్ నిర్మిస్తారని తెలుస్తుంది. కమల్ హాసన్ హీరోగా గతంలో వచ్చిన 'భారతీయుడు'కి సీక్వెల్‌గా 'భారతీయుడు 2' రూపొందుతున్న విషయం విదితమే. ప్రస్తుతం చిరంజీవి మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, జగపతిబాబు, సుదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో, త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో శంకర్‌తో సినిమా ఎప్పుడుంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. మొత్తంగా శంకర్, చిరంజీవి కాంబినేషన్లో సినిమా అంటే దానిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయనడంలో సందేహం లేదు.