Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయ్యింది. 'గత నెల రోజులుగా లిస్బన్, పోర్టొ సిటీస్‌లో ఈ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ షెడ్యూల్లో నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు వెన్నెలకిషోర్, రావురమేష్ సహా ముఖ్య తారాగణం పాల్గొన్నారు. అశేష ప్రేక్షకాదరణ పొందిన 'మన్మథుడు' సినిమా స్ఫూర్తితో ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ మంచి ఫన్ రైడర్‌గా తెరకెక్కిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం, ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్స్‌గా నిలుస్తాయి. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయా కామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, కిరణ్ (జెమిని కిరణ్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని రాజీపడకుండా నిర్మిస్తున్నారు. 'మన్మథుడు' సినిమా రేంజ్‌లోనే ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది' అని చిత్రబృందం తెలిపింది.