Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర్జున్, విజరు ఆంటోని ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'కొలైగారన్'. దియా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.నరేష్కుమార్. టి.శ్రీధర్ సంయుక్తంగా తెలుగులో 'కిల్లర్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. అషిమా కథానాయికగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా సోమవారం విడుదలైన ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తుంది. టీజర్, ట్రైలర్‌ని బట్టి ఇందులో విజరు ఆంటోని, అర్జున్ పాత్రలు పోటాపోటీగా ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇవి సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని జరుపుకుంటోంది. జూన్ తొలి వారంలో సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఇది తెలుగు ఆడియెన్స్‌ని ఆకట్టుకునే చిత్రమవుతుంది' అని అన్నారు. నాజర్, సీత, భగవతి పెరుమాల్, గౌతమ్, సతీష్, సంపత్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కే కింగ్, కెమెరా: మాక్స్, ఎడిటర్: రిచర్డ్ కెవిన్. ఆర్ట్: వినోద్ రాజ్‌కుమార్.