Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేన్స్ 72వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. రోజు రోజుకి రెట్టింపు ఉత్సాహం తో తారలు పాల్గొంటూ మరింత సందడి చేస్తున్నారు. ఎనిమిదో రోజు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఔట్ ఆఫ్ ది బాక్స్ తరహాలో వైట్ కలర్ డ్రెస్‌తో కనువిందు చేసి అందరిని ఆశ్చర్యపరి చింది. లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్ నటించిన 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్ర ప్రీమియర్‌లో భాగంగా సోనమ్ ఎర్ర తివాచీపై హోయలు పోయింది. ఇందులో 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్' చిత్ర బృందం పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎనిమిదో రోజు కేన్స్ సరికొత్త కళని తీసుకొచ్చారు. వీరితోపాటు ప్రపంచ సుంద రాంగులు జోసెఫిన్ స్క్రివర్, జాంగ్ జియి, ఎల్లీ ఫన్నింగ్, డకోటా ఫన్నింగ్, సారా సంపాయో, మార్గోట్ రాబీ, మైఖెల్లె రోడ్రిగ్విజ్, జోయి బెల్, చైరా ఫెరాగ్ని, కామిలా మోర్రోన్, కోకో రోచా తోపాటు టిమోతీ చాలమెట్, సారీ కెస్లర్, క్వెంటిన్ టరంటినో, డకీ థాట్, నినా దబ్రెవ్ తదితరులు ఎర్రతివాచీపై వాక్ చేస్తూ సందడి చేశారు.