Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేన్స్ 72వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం పది రోజులుగా ఆద్యంతం సందడిగా సాగుతోంది. రోజూ నవ్యమైన వస్త్ర సంస్కృతిని చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన కథానాయికలు వీక్షకులను మెప్పిస్తున్నారు. రొటీన్‌కి భిన్నంగా పదో రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే పదో రోజు కేన్స్‌లో 'యామ్ఫర్ గాలా' పేరుతో ఓ ప్రత్యేక ఈవెంట్‌ని నిర్వహిస్తారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనల కోసం ఫండ్ రైజింగ్ చేపడతారు. ఎప్పటిలాగే ఈసారి కూడా 'యామ్ఫర్ గాలా' కార్యక్రమంలో నాయికలు తమదైన ట్రెండీ డ్రెస్సెస్ ధరించి సందడి చేశారు.
ఇందులో ఎల్సా హోక్, డ్యూ లిపా, స్టెల్లా మాక్స్వెల్, రెబెల్ విల్సన్, కోకా రోచా, చేస్ కార్టర్, సారా సంపాయో, చైరా ఫెరాగ్ని, నటాశా పోలీ, జెస్మిన్ టూకెస్, నియోల్ కాప్రి, కరోలినా కుర్కోవా, ఇజబెల్ గౌలార్ట్, ఆండ్రియానా లిమా, ఎవా లాంగోరియా, లుకా సబ్బట్, జోర్డన్ బర్రెట్, జోసెఫిన్ స్క్రీవర్, లునా బిజిల్, మర్తా హంట్, విన్నీ హార్లో, వలెరీ కాఫ్‌మ్యాన్, టోమీ హైల్ఫిగర్, షానైనా షేక్, పమేలా ఆండర్సన్, మిల్లా జోవోవిచ్, కరైన్ రోయిట్ఫీల్డ్, క్రిస్ లీ వంటి కథానాయికలు ఫండ్ రైజింగ్ ఈవెంట్లో పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు. అయితే గతంలో కంటే ఈ సారి ఈ ఈవెంట్‌కి భారీ స్పందన లభించింది. ప్రముఖ కథానాయికలందరూ ఇందులో పాల్గొని సందడి చేశారు. అంతేకాదు ఎయిడ్స్‌కు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇక ఈ వేడుకలో క్రెచ్ టైకూన్ మిలాస్ కాంట్, తన అందమైన ప్రియురాలు ఫోర్చ్గీస్ రియాలిటీ టీవీ స్టార్ మార్గరిడా ఆరానాకి రెడ్ కార్పెట్ వేదికగా ప్రేమని ప్రపోజ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. అయితే ఆద్యంతం సస్పెన్స్‌గా సాగిన ఈ ప్రపోజల్లో చివరికి ప్రియురాలు 'ఎస్' చెప్పడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ సంఘటన కేన్స్‌కే ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది.