Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'. 'బెజవాడ సింహం' అనేది ఉపశీర్షిక. నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తుండగా, నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ, 'బెజవాడలో ఇద్దరు మహానాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యం, సెంటిమెంట్‌ను జోడిస్తూ సినిమాని రూపొందిస్తున్నాం. వంగవీటి రంగా పాత్రలో ప్రముఖ వ్యక్తి నటించ నున్నారు. వంగవీటి రాధ పాత్రలో బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ అద్భుతమైన నటన కనపరిచారు. వెంకటరత్నం మళ్లీ పుట్టారా అనిపించేలా ఆయన నటన ఉండటం విశేషం. నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటించడం మరో విశేషం' అని అన్నారు. '1977 దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్‌లో జై ఆంధ్ర స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ చిత్రంలో ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల చిత్రీకరణ జరుపుతున్నాం. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. నటీనటులందరు చాలా బాగా నటించారు' అని నిర్మాత రాము రాథోడ్ తెలిపారు. నాగినీడు, పృథ్వీ, అజరు, చౌదరి, అన్నపూర్ణమ్మ, శివారెడ్డి, తేజ రాథోడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.