Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న చిత్రం 'డిస్కోరాజా'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ, 'సినిమా తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఇటీవలే రెండో షెడ్యూల్‌ని ప్రారంభించాం. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో రవితేజతోపాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీగా వేసిన సెట్లో హీరో, విలన్ల మధ్య పోరాట సన్నివేశాలు షూట్ చేస్తున్నాం. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదల చేసిన చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి విశేషమైన స్పందన లభించింది. సినిమా కూడా అన్ని వర్గాలను ఎంటర్టైన్ చేస్తుంది' అని అన్నారు. బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్‌కి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్: కార్తీక్ ఘట్టమనేని, మ్యూజిక్: థమన్, ఎడిటర్: నవీన్ నూలి.