Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటరాజ్, నూరిన్ షెరీఫ్, అంకిత మహరాణ హీరోహీరోయిన్లుగా సత్య ప్రకాష్ దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం 'ఉల్లాలా.. ఉల్లాలా'. ఈ సినిమా బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. హీరోహీరో యిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివే శానికి ప్రముఖ దర్శకుడు తేజ క్లాప్ నివ్వగా, నటుడు బెనర్జీ, అశోక్ కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. మరో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ, 'సత్య ప్రకాష్ చెప్పిన కాన్సెప్ట్‌కి కడుపుబ్బ నవ్వుకున్నాను. ఇలాంటి కాన్సెప్ట్ అరుదుగా వస్తుంటాయి. నిర్మించేందుకు ముందుకు వచ్చా. బుధవారమే ఓపెనింగ్ జరుపుకున్న ఈ సినిమాని ఇదే రోజు సాయంత్రానికి పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నాం. అదెలా అనేది త్వరలో వెల్లడిస్తాం. ఇందులో ఆర్టిస్టుల పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కన్నడలో మంచి పేరు తెచ్చుకున్న నటరాజ్ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నారు' అని అన్నారు. 'నేను దాదాపు అన్ని భాషల్లో విలన్‌గా నటించాను. నేనీ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం కెమెరామెన్ జె.జీ కృష్ణ. అప్పట్నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాం. ఈ సినిమా ఇంత వరకు రావడానికి ప్రధాన కారణం నిర్మాత గురురాజ్. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన పేరుంటుంది. సినిమాని ఫ్లైయింగ్ కెమెరాతో చిత్రీకరించాం. ఇందులో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు కనిపిస్తాయి. దెయ్యాలు, మనుషులు, బొమ్మలుంటాయి. మరి వాటి కథేంటనేది సినిమా చూడాల్సిందే. బలమైన కథతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది' అని దర్శకుడు సత్యప్రకాష్ చెప్పారు. హీరో నటనాజ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాకి నాన్న దర్శకత్వం వహిస్తున్నారని తెలిసి షాక్ అయ్యాను. ఆయన నాకు గురువు, ఐడల్. ఆయన దర్శకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉంది' అని చెప్పారు.