Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''గేమ్ ఓవర్' చిత్రంలో నా పాత్ర ఒక కొత్త అనుభవం. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రని పోషించలేదు' అని అంటోంది తాప్సీ. తెలుగు, తమిళంలో థ్రిల్లర్ ప్రధానంగా 'గేమ్ ఓవర్' చిత్రం రూపొందుతోంది. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. ఇందులో ఆమె వీల్ చైర్‌కే పరిమితమైన, చీకటి అంటే భయపడే, మానసికమైన ఇబ్బందులు పడే అమ్మాయిగా నటించారు. ఆ అనుభవాల గురించి తాప్పీ స్పందిస్తూ, 'ఇందులో నటించడం శారీరకంగా, మానసికంగా ఓ కొత్త అనుభవం. మానసికంగా చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చింది. చాలా బాధాకరమైన ఒత్తిడిని, ప్రతి స్పందనని, తక్కువ కాన్ఫిడెన్స్, వాటితో కూడిన భావోద్వేగాలు సహజంగా రావు. ఎందుకంటే గతంలో వాటిని నేను చేయలేదు. అందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ చిత్ర సహ రచయిత కావ్య రామ్‌కుమార్ ఎంతో హెల్ప్ చేశారు. ఆయా సీన్స్ వెనకాల ఉన్న అంతరార్థాన్ని గమనించి సహజంగా నటించేందుకు ప్రయత్నించా. లైఫ్‌లో ఇలాంటి పాత్రలు, సినిమాలు చేసే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన అవకాశంగా 'గేమ్ ఓవర్' చిత్రాన్ని భావిస్తున్నా. నటిగా నాలోని నవ్య కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే ఛాన్స్‌ని కూడా ఈ సినిమా కల్పించినందుకు సంతోషంగా ఉంది' అని తెలిపింది. ల తాప్సీ ప్రస్తుతం 'తడ్కా', 'మిషన్ మంగళ్', 'సాండ్ కి ఆంఖ్'తోపాటు జయం రవి సరసన ఓ సినిమాలోనూ నటిస్తోంది.