Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల నటుడిగా తెలుగు తెరపై మెరిసిన కౌశిక్ ప్రస్తుతం శశాంక్ వోలేటి దర్శకత్వంలో తెలుగు, మలయాళంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం 'మిస్టర్ కె'లో నటిస్తున్నారు. ఇకపై కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకే ప్రయారిటీ ఇస్తానంటున్న కౌశిక్ పుట్టిన రోజు నేడు (సోమవారం).
ఈ సందర్భంగా మీడియాతో కౌశిక్ మాట్లాడుతూ,' హీరోగా మలయాళంలో నటించిన 'వైట్ బార్సు' చిత్రానికి ఇటీవల మూడు స్టేట్ అవార్డులు రావడం ఈ పుట్టిన రోజు గిప్ట్గా భావిస్తున్నాను. అక్కడ నటించిన
4 చిత్రాలతో నటుడిగా మంచి పేరొచ్చింది. నటుడిగా కమల్‌హాసనే నాకు స్ఫూర్తి. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. యాక్షన్ సినిమాలతో పాటు ఇకపై అన్ని తరహా పాత్రల్లో నటిస్తాను' అని చెప్పారు.