Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజస్, చాందిని జంటగా కిట్టు నల్లూరి దర్శకత్వంలో వి.ఎస్.పి తెన్నేటి సమర్పణలో వెంకటేష్ బాలసాని నిర్మిస్తోన్న చిత్రం 'కేటుగాడు'. విడుదలకు సిద్ధంగా ఉన్న
ఈ చిత్రం గురించి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు మాట్లాడుతూ, 'ఓ విభిన్నమైన కథతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికేట్ పొందాం. సినిమా చూసి కె.ఎస్.రామారావు మెచ్చుకోవడం ఆనందంగా ఉంది' అని అన్నారు. 'సాయి కార్తీక్ మంచి సంగీతమందించారు. జోషి ఫొటోగ్రఫీ సినిమాకు హైలెట్గా నిలుస్తుంది. మా బ్యానర్లో వస్తున్న మొదటి చిత్రమిది. సినిమా బాగా రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. సెప్టెంబర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత బాలసాని తెలిపారు. సాయి కార్తీక్ మాట్లాడుతూ, 'పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. నా సినిమాగా భావించి చేసిన చిత్రమిది' అని చెప్పారు. 'సాయి కార్తీక్ నాకు మంచి స్నేహితుడు. మ్యూజిక్ అదరగొట్టాడు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది' అని తేజస్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పృథ్వీ, ప్రవీణ్, స్నిగ్ధ, జోషి, తెన్నేటి వి.ఎస్.పి తదితరులు పాల్గొన్నారు.