Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హీరోగా కాకుండా కథలో భాగంగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నా. హీరోగానే కనిపించాలంటే అలాంటి సినిమాలు చేయను' అని అంటున్నారు హీరో హవీష్. ప్రముఖ కెమెరామెన్ నిజార్ షఫీ దర్శకత్వంలో హవీష్, రెజీనా, నందితా శ్వేత, అదితి ఆర్య, అనిషా అంబ్రోస్, పుజితా పొన్నాడా, త్రిధా చౌదరి, రెహ్మాన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'సెవెన్'. ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో హవీష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'థ్రిల్లర్ చిత్రాల్లో ఇదొక డిఫరెంట్, కొత్త రకమైన సినిమా. సీట్ ఎడ్జ్ చిత్రమవుతుంది. రొమాన్స్, లవ్, వినోదం మేళవింపుగా ఉంటుంది. ప్రధానంగా ఏడు పాత్రల చుట్టూ సినిమా సాగుతుంది. ఆరుగురు హీరోయిన్లు, నేను ఉంటాను. అందరికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. కథ విన్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. తెరపై కూడా అంతే బాగా వచ్చింది. సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అయితే ఇందులో ముద్దు సీన్లు ఉంటాయని ముందు తెలియదు. సెట్లో దర్శకుడు వచ్చి హీరోయిన్‌కి లిప్‌లాక్ ఇవ్వమన్నారు. నాకు భయమేసింది. ఆమె కొడితే పరిస్థితేంటి అనుకున్నా. కథలో భాగంగా ఇవన్ని తప్పనిసరని తర్వాత అర్థమైంది. బేసిక్‌గా నాకు థ్రిల్లర్, హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉండదు. రెగ్యులర్ థ్రిల్లర్‌గా ఇది ఉండదు, అందుకే చేశా. చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఏడేండ్లు అవుతుంది. 'రామ్‌లీల' తర్వాత ఓ పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది. తర్వాత దాన్ని మరో హీరోతో చేశారు. ఓ సినిమా మధ్యలో ఆగిపోవడంతో గ్యాప్ వచ్చింది. అయినా కెరీర్ పరంగా అసంతృప్తి లేదు. హీరోగా కాకుండా కథలో భాగంగా ఉండే సినిమాలైనా చేస్తాను. ఏదైనా నన్ను ఎగ్జైట్ చేయాలి. ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్‌లో చేసే సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపిస్తాను. ఫ్యామిలీ డ్రామా చిత్రమది' అని అన్నారు.